నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), మే 13 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ పలు సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షా కేంద్రాల్లో మంగళవారం విద్యార్థుల హాల్ టికెట్ నంబర్లను వేసి సర్వం సిద్ధం చేశారు. ఉదయం, మధ్యాహ్నం జరిగే ఈ పరీక్షలకు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి విద్యార్థులకు సూచించారు.
– ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలను ఎంజీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లాలో 14, సూర్యాపేట జిల్లాలో 10, యాదాద్రి భువనగిరి జిల్లాలో 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
– రెండో సెమిస్టర్లో 1,04,008 మంది విద్యార్థులు, నాలుగో సెమిస్టర్లో 8,660, ఆరో సెమిస్టర్‌కు 4,171 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
– ఒకటో సెమిస్టర్‌కు 66, మూడో సెమిస్టర్లో 519, ఐదో సెమిస్టర్‌కు 4,171 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.