నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), మే 14 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు 6వ సెమిస్టర్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 1వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు జరిగాయి. దేవరకొండలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 6వ సెమిస్టర్ పరీక్షలో ఓ విద్యార్థిని మాల్ ప్రాక్టీస్ పాల్పడుతుండగా స్క్వాడ్ బృందం గుర్తించి డీబార్ చేసింది.
– ఆరో సెమిస్టర్ పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6,007 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 5,689 మంది హాజరయ్యారు. 317 మంది గైర్హాజరయ్యారు.
– మధ్యాహ్నం జరిగిన ఒకటవ సెమిస్టర్ పరీక్షలకు 1,176 మంది హాజరు కావాల్సి ఉండగా 1,015 మంది హాజరయ్యారు. 161 మంది గైర్హాజరయ్యారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కళాశాలతో పాటు పలు పరీక్ష కేంద్రాలను మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి పరిశీలించారు. పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన పరీక్షలను యూనివర్సిటీ అసిస్టెంట్ కంట్రోలర్ డాక్టర్ లక్ష్మీప్రభ తనిఖీ చేశారు.
MGU : డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం.. తొలిరోజు విద్యార్థిని డీబార్