నల్లగొండ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ పరిధిలోని నందిపాడు బైపాస్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను కంటైనర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న భార్యాభర్తలిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 వాహనంలో ఏరియా హాస్పిటల్కు తరలించారు. కాగా, బాధితుల బంధువులు రోడ్డుపై ధర్నాకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.

రోడ్డుపై బారులు తీరిన వాహనాలు