తుంగతుర్తి, అక్టోబర్ 27 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వెంటనే కాంటాలు ప్రారంభించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం మండలంలోని బండరామారంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ముందు నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులు దాటినప్పటికీ కాంటాలు ప్రారంభించక పోవడంతో రైతాంగం ఇబ్బందులు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అకారపు భాస్కర్, కొల్లూరి మహేందర్, జటంగి బక్కయ్య, రేగటి రాములు, గడ్డం సూరయ్య, కోరుకొప్పుల ఉప్పలయ్య, వెంకన్న, యాకస్వామి, సోమన్న, మహిళా రైతులు పాల్గొన్నారు.