నల్లగొండ, జనవరి 08 : నల్లగొండ క్యాంప్ కార్యాలయంలో 41 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరు అయిన రూ.12.50 లక్షల విలువ గల చెక్కులను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. సీఎంఆర్ఎఫ్ పథకం చాలా ఉపయోగకరమైన పథకమని, ఈ పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. అర్హులైన వారందరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.