పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంతో పాటు మండలంలోని పలు పాఠశాలల్లో మనఊరు..
- ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు
మిర్యాలగూడ, డిసెంబర్ 27 : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంతో పాటు మండలంలోని పలు పాఠశాలల్లో మనఊరు.. మనబడి పథకం కింద చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డితో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని 70 పాఠశాలల్లో రూ.40.68 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో సరిపోను తరగతి గదులు, తాగునీరు, టాయిలెట్స్, విద్యుత్, ఫర్నీచర్, ప్రహరీ, వంటగది, డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు అన్నభీమోజు నాగార్జునాచారి, మగ్దూంపాషా, పెద్ది శ్రీనివాస్‌గౌడ్, ఇందిర, గోవింద్‌రెడ్డి, వెంకమ్మ, మధు, శ్రీనివాస్‌రావు, లింగారెడ్డి, వంశీ పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 41 మంది బాధితులకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.21.05 లక్షల చెక్కులను ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డితో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కుందూరు వీరకోటిరెడ్డి, హతీరాంనాయక్, రవితేజనాయక్, అమరావతి సైదులు, బాబయ్య, సూర్యానాయక్, సైదిరెడ్డి, బాలూనాయక్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
గ్రామీణ రోడ్లకు అధిక నిధులు
మిర్యాలగూడ రూరల్ : గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు విడుదల చేస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మండలంలోని ఆర్అండ్బీ రోడ్డు నుంచి సామ్యగాని తండా వరకు ఎంపీ కేశవరావు నిధులు రూ.30 లక్షలు, గిరిజన సంక్షేమశాఖ నిధులు రూ.38 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణానికి, శ్రీనివాస్‌నగర్‌లో రూ.10 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు మంగళవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గడగోజు ఏడు కొండలు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ధనావత్ చిట్టిబాబునాయక్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బోగవల్లి వెంకటరమణాచౌదరి, సర్పంచ్ ధనావత్ సైదానాయక్, ఎంపీటీసీ సుజాత, పీఆర్ డీఈ, ఏఈలు ముత్తవరపు వెంకటేశ్వర్రావు, చిల్లంచర్ల ఆదినారాయణ, టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ, జగదీశ్, ప్రసాద్, గోవిందు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

