రామగిరి (నల్లగొండ), ఏప్రిల్ 26 : నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్లులో గల శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాలకు విద్యార్థుల సౌకర్యార్థం రుద్రసేన ఆధ్వర్యంలో శనివారం తొమ్మిది కూలర్లను అందజేశారు. ఈ సందర్భంగా రుద్రసేన చైర్మన్ గంట్ల అనంతరెడ్డి మాట్లాడుతూ.. వేదం పట్టించే విద్యార్థులకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని, ఆ ఛాయా సోమేశ్వరుడి ఆశీస్సులతో మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో మున్ముందు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
అనంతరం రుద్రసేన సభ్యులు ప్రధానాచార్యులు, అధ్యాపకులను సన్మానించారు. విద్యార్థులకు పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రుద్రసేన సభ్యులు శ్రీనివాస్ శర్మ, అడ్వకేట్ రమణ, గుండగోని సోమశేఖర్ గౌడ్, నోముల వెంకటేశ్వర్లు, కాసర్ల శేఖర్ రెడ్డి, మల్లెబోయిన హరిబాబు, బిస్టు రవి, ధారా వెంకట్, బోనగిరి మహేందర్, పర్వత్ రెడ్డి, భరత్ రెడ్డి, మణికుమార్ రెడ్డి పాల్గొన్నారు.
Panagal : వేంకటేశ్వర వేద పాఠశాలకు కూలర్ల బహుకరణ