మునుగోడు, మే 03 : విద్య, వైద్య, ఉపాధి హక్కుల సాధనకై నిరంతర పోరు సాగించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పార్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగ శనివారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోయువజన సంఘం జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. మన దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో యువత పాత్ర ప్రధానమైందన్నారు. యువతరంలో ప్రగతిశీల, అభ్యుదయ భావాలను, దేశభక్తి, లౌకిక ప్రజాస్వామిక ఆలోచనలను, నైతిక విలువలను, మానవత్వాన్ని పాదుకొల్పడానికి ఏఐవైఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
ఏఐవైఎఫ్ పని హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలని, సమగ్ర యువజన విధానం కోసం విద్య, వైద్య వ్యాపారాన్ని రద్దు చేయాలని, అవినీతికి వ్యతిరేకంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం, ప్రకృతి సంపద ప్రజలకే దక్కాలని, భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్‌ను రూపొందించి అమలు చేయాలని పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు పులికరం ఆంజనేయులు, బొలుగూ