– రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య
కోదాడ, మార్చి 23 : విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నికైన రావెళ్ల సీతారామయ్యకు కోదాడ యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా అభినందన సభ నిర్వహించారు. యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో ముఖ్య అతిథిగా డాక్టర్ జాస్తి సుబ్బారావు పాల్గొని మాట్లాడారు. సీతారామయ్య కేవలం నాయకుడిగానే కాకుండా పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి, సంఘానికి మధ్య సమన్వయకర్తగా ఒక గొప్ప రూపశిల్పిగా కృషి చేస్తున్నారని ఆయన సేవలను కొనియాడారు. అనంతరం సీతారామయ్య మాట్లాడుతూ పెన్షనర్ల శ్రేయస్సు కోసం వారి హక్కుల సాధనకు తన శక్తి మేరకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానన్నారు.
ఈ సందర్భంగా సీతారామయ్య దంపతులను జిల్లా, వివిధ మండలాల శాఖల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు, జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, కోదాడ యూనిట్ కార్యదర్శి రఘువర ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి తమ్మన బోయిన వీరబాబు, అసోసియేట్ అధ్యక్షుడు వి.జానయ్య, ఉపాధ్యక్షులు యస్దాని, భ్రమరాంబ, సంయుక్త కార్యదర్శి భూపాల్ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి హాజీ నాయక్, బాలేమియా, నీరజ, మణిరాం, శంబయ్య, తిరపమ్మ, పొనగండ్ల చిన వీరారెడ్డి, అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.