న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసును విచారించాలని అలహాబాద్ కోర్టు.. సీబీఐ, ఈడీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసును ఆగస్టు 17వ తేదీన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, వీ మోహనతో కూడిన ధర్మాసనం విచారించనున్నది. లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్తులపై సీబీఐ ఇచ్చిన వివరణ పట్ల గతంలో అలహాబాద్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణకు చెందిన కొత్త అఫిడవిట్‌ను దాఖలు చేయాలని జూలై 20వ తేదీన లక్నో బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈడీ విచారణ సమయంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏవైనా డాక్యుమెంట్లు సేకరించారా అని కూడా హైకోర్టు ప్రశ్నించింది. కర్నాటక నివాసి ఎస్ విఘ్నేశ్ సిసిర్ దాఖలు చేసిన రిట్ పిటీషన్ ఆధారంగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రాహుల్ గాంధీకి ద్వంద్వ పౌరసత్వం ఉన్నట్లు కూడా గతంలో విఘ్నేశ్ ఓ పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.