చండూరు, జనవరి 31: మున్సిపల్ ఎన్నికల వేళ చండూర్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. చండూరు మున్సిపాలిటీకి చెందిన ఏడో వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తాంధారి రవి గౌడ్, ఆయన అనుచరులు, పలువురు యువకులు పెద్ద ఎత్తున మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సూర్యాపేట మాజీ వైస్ చైర్మన్, మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్త గోపగాని వెంకట్ నారాయణ గౌడ్ సమక్షంలో శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చండూరు మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తే ఇప్పటివరకు అవి ఖర్చు చేయకుండా పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా, అస్తవ్యస్తంగా ఉన్నట్లు తెలిపారు. చండూర్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురడం ఖాయమన్నారు.
ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొత్తపాటి సతీష్, రాష్ట్ర నాయకుడు ఎత్తపు మధుసూదన్ రావు, భీమనపల్లి శివ శంకర్, కమ్మపాటి ప్రదీప్, నోముల లోకేష్, బన్నీ, రాజు, శ్రీరామ్, చేరిపెల్లి మధు, తేజ, అనిల్, నరేష్, శివమణి, గణేష్, జుబేర్, అలీం, అనపర్తి శేఖర్, తేలుకుంట్ల చంద్రశేఖర్, తేలుకుంట్ల జానయ్య, గుంటి వెంకటేశం, బోడ శ్రీకాంత్, రామ్ గోపాల్, గండూరి జనార్ధన్, సామ యాదవ రెడ్డి, బీఆర్ఎస్ చండూరు అధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్, మండల మాజీ అధ్యక్షుడు పెద్దగోని వెంకన్న గౌడ్ పాల్గొన్నారు.