గట్టుప్పల్, జూన్ 02 : కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సోమవారం సీపీఐ గట్టుప్పల్ మండల 2వ మహాసభ వెల్మకన్నె గ్రామంలో మాదగాని యాదయ్య ప్రాంగణంలో నిర్వహించారు. మహాసభకు కారింగు శ్రీను అధ్యక్షత వహించారు. మహాసభకు హాజరైన ఎమ్మెల్సీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో అధికారులు అక్రమాలకు తావివ్వకుండా చూడాలన్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రాజీవ్ యువ వికాస్ తదితర పథకాల అమలులో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలకు కొమ్ముకాస్తూ శ్రామిక వర్గాలను అణగదొక్కే కుట్ర చేస్తుందని, అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను తుదముట్టిస్తుందని తెలిపారు.
ఈ మహాసభలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తీర్పారు వెంకటేశ్వర్లు, నలపరాజు రామలింగయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు బి.లాలయ్య, చాపల శ్రీనివాస్, గట్టుపల్ మండల కార్యదర్శి భీమనపల్లి రమేశ్, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చలం పాండు రంగారావు, జగన్, ఏఐవైఎఫ్ నాయకులు గడ్డం నవీన్, కట్ట దశరథ, రాపోలు సత్తయ్య, ధనుంజయ, కందాల ముత్యం, దెందే నరసింహ, హైదరాజ లక్ష్మయ్య, మాదగోని యాదయ్య, రావుల లక్ష్మయ్య, వల్ల పెంటయ్య, కందాల నాగరాజు, షేక్ బషీర్, కందాల శ్రీశైలం, బాల లింగయ్య, తోటి రాజు పాల్గొన్నారు.