చందంపేట ( దేవరకొండ ), జూలై 28 : త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నుండి సుమారు 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికి రవీంద్రకుమార్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కొండమల్లేపల్లి మండలంలోని చింతచెట్టు తండా, వడ్త్యా తండా, జిత్యతండా, ఫుల్ సింగ్ తండాలకు చెందిన వారు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక, ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడం వంటి అంశాలతో విసుగుచెందిన వారంతా వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీ చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి, లింగారెడ్డి, దస్రూ నాయక్, తులసి రామ్ నాయక్, రాజు కృష్ణ పాల్గొన్నారు.