కట్టంగూర్, అక్టోబర్ 11 : రైతులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా వారు పండించిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం మండలంలోని అయిటిపాముల, చెర్వుఅన్నారం, గార్లబాయిగూడెం, కురుమర్తి, మునుకుంట్ల, ఈదులూరు, నారెగూడెం, పరడ, కట్టంగూర్, ముత్యాలమ్మగూడెం గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ఏ గ్రేడ్ కు రూ.2389, బీగ్రేడ్ కు రూ.2369 మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరిపడ సౌకర్యాలు కల్పించడంతో పాటు కాంటా వేసిన ధన్యాన్ని వెంటనే మిల్లర్ల తరలించాలని సిబ్బందికి సూచించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో డీఆర్ డీఏ పీడీ శేఖర్ రెడ్డి , నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల, డీపీఎం మోహన్ రెడ్డి, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ స్పెషల్ ఆఫీసర్, క్లస్టర్ ఇన్ చార్జి నాగేశ్వరావు, తాసీల్దార్ పుష్పలత, ఎంపీఓ స్వరూపారాణి, ఏపీఎం రాములు, మహిళ సమాఖ్య అధ్యక్షురాలు ఐతగోని ఝాన్సీ, మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, నాయకులు పెద్ది సుక్కయ్య, రెడ్డిపల్లి సాగర్, బెజవాడ సైదులు, పెద్ది యాదగిరి,గడుసు శంకర్ రెడ్డి, ఐతగోని నారాయణ, అయితగోని నర్సింహ్మ, మిట్టపల్లి శివ, ముక్కాముల శేఖర్, కురిమిల్ల మల్లేష్, బూరుగు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.