నందికొండ, ఏప్రిల్ 6: కాంగ్రెస్ నాయకులు ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి రాష్ర్టాన్ని దోచుకోవాలనే పనిలో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. సోమవారం ఆయన నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో మండల బీఆర్ఎస్ నాయకులతో కల సి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రులు అక్రమంగా భూములు, మైనింగ్, ఇసుక దందాలకు పాల్పడుతుంటే, నియోజకవర్గంలో ఎమ్మెల్యే, వారి అనుచరులు సంపాదనే ధ్యేయంగా అన్ని రకాల దుర్మార్గాలకు పాల్పడుతూ, ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇసుక దందా లేకుండా చేసి, ఇసుక టాక్స్ వసూలు చేసి ప్రజా సంక్షేమానికి ఉపయోగించామన్నారు.
కాంగ్రెస్ వచ్చిన రెండున్నర ఏండ్ల కాలంలో ఇసుక టాక్స్ ద్వారా రూ.50 కోట్లు కూడా వసూలు చేయలేదన్నారు. నియోజకవర్గంలో ఎడమ కాల్వ లైనింగ్ పనులకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని వార్త కథనాలు ప్రచురితమైనా అధికారుల్లో ఎలాంటి స్పందన లేదన్నారు. కాంగ్రెస్ నాయకుల అండదండలతో కాంట్రాక్టర్లు యథేచ్ఛగా ఇసుకను ట్రిప్పర్లతో తరలిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారన్నారు. రామడగు, శ్రీనాధపురం గ్రామాల మధ్య ఉన్న వాగులో నుంచి భారీ మొత్తంలో ఇసుకను తరలిస్తున్నారన్నారు.
దీనివల్ల ఎడ మ కాల్వకు ప్రమాదం ఉందని పలుమార్లు అధికారుల దృష్టికి తెచ్చినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎడమ కాల్వ కాంట్రాక్టర్లుతో కుమ్మకై రూ. కోట్లు తీసుకున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయని, వాటిపై విచారణ చేపట్టి వాస్తవాలు వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో నాగార్జునసాగర్‌ను పర్యాట కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ నాయకులు పర్యాటక కేంద్రంగా ఉన్న సాగర్‌ను పేకాట, గంజాయి లాంటి వ్యసనాలకు కేంద్రంగా మా ర్చే పనిలో ఉన్నారన్నారు. నాగార్జునసాగర్‌లో ఇటీవల ఒక హోటల్లో కాంగ్రెస్ నాయులు పేకాట ఆడుతుండగా పోలీసులు పట్టుకున్నారన్నారు.
స్థానిక ఎమ్మెల్యే, అనుచరులు పోలీసులను బెదిరించడంతో వదిలి పెట్టినట్లు తెలిసిందని దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలన్నారు. నియోజకవర్గంలో అరాచకం రాజ్యమేలుతోందని, త్రిపురారం లో నగిరి శ్రీనివాస్ చేయి విరగ్గొట్టిన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని, అనుముల మండంలో ఫారెస్టు సంపద కొల్ల గొడుతున్నారని ఫిర్యాదు చేసిన వ్యక్తిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారన్నారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోతే చట్టాన్ని రక్షించేందుకు తాము దేనికైనా సిద్ధమన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అక్రమ దందాల కు పాల్పడుతూ ప్రజల సంపదను కాంగ్రెస్ నాయకులు దోచుకోవడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కార్యక్రమం లో పార్టీ మండల అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ చెన్ను సుందర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ హిరేకార్ రమేష్‌జీ, వార్డు ఇన్చార్జులు సయ్యద్ మక్సూద్, కోడా విజ య్, ఘని, మాజీ వైస్ చైర్మన్ ఆదాస్ విక్రమ్, నాయకులు అర్జున్ నాయక్, శివ, మహేశ్, మన్సూర్, నజీర్, రవి, షరీఫ్ పాల్గొన్నారు.