గట్టుప్పల్, అక్టోబర్ 12 :భవిష్యత్తులో కావ్య ఉన్నత వైద్యురాలుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని తేరటుపల్లి మాజీ సర్పంచ్ వీరమల్ల శ్రీశైలం అన్నారు. నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల పరిధిలోని వెలమన్నె గ్రామానికి చెందిన భీమనపల్లి యాదయ్య కుమార్తె భీమనపల్లి కావ్య జాతీయ స్థాయి నీట్లో 393వ ర్యాంక్ సాధించింది. కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీలో వైద్య విద్యలో చేరాల్సి ఉండగా చదవటానికి ఆర్థిక పరిస్థితులు అడ్డురావడంతో గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న తేరటుపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వీరమల్ల శ్రీశైలం రూ.లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఆదివారం అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఎంబీబీఎస్ కోర్సులో మంచి ప్రతిభ కనబరిచి నిరుపేదలకు సేవ చేయాలని కోరారు. సమాజానికి వైద్యురాలుగా సేవ చేయడానికి కావ్య ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత శిఖరాలను అవరోధరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నామిని జగన్నాథం, వెలమకన్నె గ్రామ శాఖ నూర్ మహ్మద్, రావుల పర్వతాలు, చల్లమల్ల వెంకటరమణ రెడ్డి, దెందే బీరప్ప తదితరులు పాల్గొన్నారు.