కొండామల్లేపల్లి, ఫిబ్రవరి 04 : అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని బీఆర్ఎస్ కొండామల్లేపల్లి మండలాధ్యక్షుడు రమావత్ దస్రూ నాయక్, యువజన విభాగం మండలాధ్యక్షుడు, చెన్నారం సర్పంచ్ రమావత్ తులసిరామ్ అన్నారు. బుధవారం మిర్యాలగూడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు వీరిని ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అక్రమ అరెస్టులు ఆపి అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. రైతులకు రైతు బంధు అందించాలని, యూరియా ఇబ్బందులను తొలగించాలని పేర్కొన్నారు.