‘ప్రభుత్వం రైతు డిక్లరేషన్‌ను అమలు చేయాలి’
వరంగల్ వేదికగా కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ను ప్రభుత్వం అమలు చేయాలని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్ డిమాండ్ చేశారు. శనివారం కోదాడ పట్టణంలో..
కోదాడ, మే 02 : వరంగల్ వేదికగా కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ను ప్రభుత్వం అమలు చేయాలని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్ డిమాండ్ చేశారు. శనివారం కోదాడ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మే 6న బీఆర్ఎస్ పార్టీ వరంగల్ లో నిర్వహించనున్న రైతు సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ఎన్నికల్లో హామీలు ఇచ్చి ప్రజలను వంచించి గెలిచిందని విమర్శించారు. ఇప్పుడు హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిందన్నారు.
ఉద్యమ నేత కేసీఆర్ రైతు బాంధవుడు అన్నారు. రైతులను రాజును చేసేందుకు రైతు బంధు, రైతు బీమా, ఎరువులు, చివరి ఆయకట్టు భూములకు సాగునీరు, పలు పంటలకు బోనస్ అందించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పయిడిమర్రి సత్యబాబు, కౌన్సిలర్ చీమ నరేష్, నాయకులు ఇమ్రాన్ ఖాన్, శ్రీనివాస్, పిట్టల భాగ్యమ్మ, గోపాల్, కరీముల్లా, ఉపేందర్, మల్లయ్య గౌడ్, చారి, అలీమ్, నిస్సార్, జానీ, దస్తగిరి, ఆసిఫ్, లక్ష్మయ్య, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

