నల్లగొండ రూరల్, డిసెంబర్ 09 : ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ మండలంలోని కొత్తపల్లి, రాములబండ గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు జిల్లపల్లి రేణుక రాజు, రూపాని పెద్దులు ను గెలిపించాలని కోరుతూ ఆయన ప్రచారం నిర్వహించారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి రెండేళ్లు అయినప్పటికీ గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో ఎక్కడ ఓడిపోతామో అనే ఆలోచనతో అధికార పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకులను, ఓటర్లను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తూ బెదిరిస్తున్నారన్నారు.
మరో మూడేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, కేసీఆర్ మరోమారు ముఖ్యమంత్రి అవుతారన్నారు. కేసీఆర్ సారధ్యంలోనే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని వెల్లడించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ శ్రేణులు బోధన వెంకటరమణ రెడ్డి, నక్క వెంకటేశం, పాలడుగు లింగస్వామి, నక్క సైదులు, పెరిక భిక్షం, ఎం.స్వామి, జిల్లపల్లి బొక్కయ్య, ఏడుకొండల నాగరాజు, పెరిక వెంకటేశం, ఇరిగి శ్రీశైలం, పల్లెబోయిన యాదయ్య, నరసింహులు పాల్గొన్నారు.

Nalgonda Rural : హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి