కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
వ్యవసాయ రంగానికి నాణ్యమైన కరెంట్ సరఫరా చేయడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, బావుల్లో నీళ్లున్నా కరెంట్ కోతలతో పంటలకు నీరందించలేకపోతున్నారని...
– గుర్రంపోడ్లో రైతులతో కలిసి భారీ రాస్తారోకో, ధర్నా
గుర్రంపోడ్, అక్టోబర్ 13 : వ్యవసాయ రంగానికి నాణ్యమైన కరెంట్ సరఫరా చేయడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, బావుల్లో నీళ్లున్నా కరెంట్ కోతలతో పంటలకు నీరందించలేకపోతున్నారని, పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరెంట్ కోతలు ఆపాలని, పంటలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కరెంట్ కోతలు విధిస్తున్న సర్కారుకు వ్యతిరేకంగా మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గుర్రంపోడ్ మండలంలోని దేవరకొండ -నల్లగొండ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చి నిరసన తెలిపారు. ముందుగా బీఆర్ఎస్ నాయకుడు కడారి అంజయ్య యాదవ్, స్థానిక నాయకుడు పావం గోపాల్ రెడ్డితో కలిసి సబ్ స్టేషన్ వద్ద రాస్తారోకో చేశారు. విద్యుత్ ఏఈ శ్రీకాంత్ రెడ్డిని రైతులకు ఎన్ని గంటల కరెంట్ ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. వద్దురా నాయనా…కాంగ్రెస్ పాలన అంటూ నినదించారు.
అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ కరెంట్ కోతలతో పంటలు ఎండిపోయి రైతులు గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నలభై, నలభై ఐదేళ్ల కాంగ్రెస్ దరిద్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాతరేశారని, 24 గంటల కరెంట్, మండుటెండల్లోనూ నీరు అందించారని, రైతులు సంబురంగా సాగు చేశారని, భూమికి భారమైన పంటలు పండించారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మెరుగైన పాలన అందిస్తాడని రైతులు ఆశపడితే నిరాశే మిగిలిందన్నారు. వానకాలంలోనే కరెంట్ అందించకపోవడం కాంగ్రెస్ పాలన వైఫల్యానికి నిదర్శమని మండిపడ్డారు. గ్రామాల్లో మళ్లీ కాలిపోయిన వ్యవసాయ మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు దర్శనమిస్తున్నాయని తెలిపారు.

కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
జిల్లా మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంట్ ఆఫీసులు చూట్టూ తిరిగి రైతులకు ఎన్ని గంటలు కరెంటు ఇస్తున్నారని విద్యుత్ సిబ్బందిని అడిగిన ఆయన ప్రస్తుత పరిస్థితులలో ఎందుకు కరెంట్ ఆఫీసుల చుట్టు తిరుగుతలేవు, రైతుల కష్టాలను తిరుస్తలేవని ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకుడు ఎల్ఎన్ రెడ్డి, సర్పంచులు కొట్ర రామాంజనేయులు, సల్వాది సరస్వతి నగేష్, మునుకుంట్ల రాజేష్ రెడ్డి, వేముల యాదయ్య, మేక రఘుపతి రెడ్డి, తేలుకుంట్ల కుర్మాల్ రెడ్డి, పోలె రామచంద్రం, కుంభం ప్రశాంత్ రెడ్డి, నల్ల శ్రీరాములు, జాల మల్లెష్, మర్ల యాదయ్య, వెంకటయ్య, శ్రీధర్, రఘు, ఇటికాల శివ, ఆవుల కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
Rahul Gandhi | ఇండియా బ్లాక్ పార్టీలకు హైటీ ఏర్పాటు చేసిన రాహుల్.. సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరుపై చర్చ
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

