ఆత్మకూర్ ఎస్, మే 12 : నెలల తరబడి రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం అందాల పోటీలకు మాత్రం వేల కోట్లు ఖర్చు పెడుతుందని అఖిల భారత రైతు కూలి సంఘం డివిజన్ కార్యదర్శి అలుగుబెల్లి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ..
అందాల పోటీలను ప్రశ్నించే వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ, దౌర్జన్యాలకు దిగుతుందన్నారు. వెంటనే అందాల పోటీలు విరమించుకుని, అక్రమంగా అరెస్టు చేసిన వారందరిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నల్గొండ నాగయ్య, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కంచర్ల నర్సక్క, నాయకులు పోరండ్ల దశరథ, వీరన్న, గౌస్ పాల్గొన్నారు.