రామగిరి, డిసెంబర్ 24 : కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యా శాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు రోజుకో రీతిన ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. నల్లగొండ కలెక్టరేట్ వద్ద 15 రోజులుగా దీక్ష చేస్తున్న ఉద్యోగులు మంగళవారం ఒంటి కాలుపై నిరసన తెలిపారు. డీటీఎఫ్ తోపాటు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు వారికి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. రెండు వారాలుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.