చండూరు, ఫిబ్రవరి 05 : చండూరు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం తెలిపారు. గురువారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. చండూరులోని 10 వార్డుల్లో ఉన్న సిపిఎం సానుభూతిపరులు, ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరపాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, మహిళలకు, కార్మికులకు, కూలీలకు ఇస్తానన్న వాగ్ధానాన్ని అమలు జరపాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం యూరియా యాప్ ను విరమించుకోవాలని, ఈ యాప్ ఆన్లైన్ సిస్టం వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చండూరు మున్సిపాలిటీలో పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, దోమల నివారణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ, సిపిఎం సీనియర్ నాయకులు, మండల కమిటీ సభ్యులు మోగుదాల వెంకటేశం, చిట్టిమల్ల లింగయ్య, రవి, లింగస్వామి, అంజయ్య పాల్గొన్నారు.