(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): సమస్య ఏదైనా యువతరం ప్రభుత్వాలను నేరుగా నిలదీస్తున్నది. ఏకంగా ప్రభుత్వాలనే కూలదోస్తున్నది. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లో జరిగిన జెన్‌జీ ఉద్యమాలే నిదర్శనం.
శ్రీలంక: ఆర్థిక సంక్షోభంతో పాటు అవినీతిపై సమర శంఖం పూరిస్తూ 2022లో శ్రీలంకలోని యువత నిరసనోద్యమం చేశారు. అధ్యక్షుడు రాజపక్ష పదవికి రాజీనామా చేయడమే కాదు దేశాన్ని విడిచిపెట్టి పోవాల్సి వచ్చింది.
బంగ్లాదేశ్: నిరుద్యోగ సమస్యపై 2024లో బంగ్లాదేశ్‌లోనూ జెన్‌జీ ఉద్యమం ఎగసింది. ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేయడంతో పాటు దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది.
నేపాల్: ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతి, నిరుద్యోగ సమస్యలపై నిరుడు నేపాల్లోనూ జెన్ జీ యువత నిరసనలు హోరెత్తించారు. ఫలితంగా ప్రధాని కేపీ శర్మ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.