నల్లగొండ రూరల్, మే 29 : జూన్ 21 వరకు కొనసాగే 11వ యోగా మాస ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయుష్ డిపార్ట్మెంట్ హోమియో సీనియర్ మెడికల్ ఆఫీసర్ చక్రధర నరసింహారావు అన్నారు. ప్రపంచ యోగా మాస ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం నల్లగొండలోని అవుట్ డోర్ స్టేడియంలో క్రికెట్ క్రీడాకారులకు నిర్వహించిన యోగా శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
నిత్య యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం లభిస్తుందని తెలిపారు. యోగాతో మానసిక, శారీరక రోగాలను దూరం చేసుకోవచ్చన్నారు. కావునా అందరూ ప్రతినిత్యం యోగా సాధన చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.కళ్యాణ్, యోగా ఇన్స్ట్రక్టర్లు సింగం ప్రవీణ్ యాదవ్, కోమల, జ్యోతి, ఫార్మసిస్ట్ చంద్రయ్య, చంద్రమౌళి, క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అమీన్ బాబా, కోచ్ బుచ్చిబాబు పాల్గొన్నారు.
Nalgonda Rural : నిత్య యోగాతో సంపూర్ణ ఆరోగ్యం : చక్రధర నరసింహారావు