దేవరకొండ, మార్చి 21 : ముస్లిం మైనార్టీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలో దర్గా వద్ద నిర్వహించిన రంజాన్ వేడుకలో ఆయన పాల్గొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దర్గా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జామున మాదవ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పున్న సైలెజ్ వెంకటేశ్, యూనిస్, నరసింహ, వెంకటేశ్ గౌడ్, సురేశ్ గౌడ్, పాపా నాయక్, కొర్ర రాంసింగ్, హరికృష్ణ, బిక్కు నాయక్, మల్లా రెడ్డి, సిరాజ్ ఖాన్, రైస్ పాల్గొన్నారు.