పెన్ పహాడ్, మార్చి 11 : సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పరిధిలోని మేఘ్య తండా, భక్తాలపురం, ధర్మాపురం గ్రామాల్లో ఎండిపోతున్న పొలాలను, ఎస్సారెస్పీ కాల్వలను మంగళవారం కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు భూక్య క్రాంతికి చెందిన పొలంలోకి దిగి వరి పంటను పరిశీలించారు. సాగునీరు, బోరు బావుల ద్వారా వరి పొలం ఎంత సాగు చేయవచ్చునని కలెక్టర్ ఆరా తీశారు.
ఇంకా ఎన్ని రోజులు నీటి సరఫరా చేస్తే పంటలు చేతికి వస్తాయని రైతులు ఆంగోత్ నర్సింగ్ నాయక్, ఆంగోత్ లక్ష్మి, ఆంగోతి చిన్ని, ఆంగోతు రామదాసు, ఆంగోత్ కృష్ణ లను అడిగారు. బోర్లు, బావుల్లో నీరు అడుగంటి పోయిందని ఎస్సారెస్పీ కాల్వల ద్వారా ఇంకా 20 రోజులు నీరు వచ్చినట్లయితే ఆయకట్టు చివరి పొలాలు చేతికొచ్చే పరిస్థితి ఉందని రైతులు కలెక్టర్ తో తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ ధరవత్తులాలు నాయక్. ఇరిగేషన్ ఏఈ లింగయ్య. ఏఓ అనీల్నాయక్. ఆర్ఐ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.