సీజ్ అయిన నగదు గ్రీవెన్స్ కమిటీ ద్వారా పొందవచ్చు : కలెక్టర్
ఎన్నికల నేపథ్యంలో సీజ్ అయిన నగదు విడుదల కోసం కలెక్టరేట్లో గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేశామని, సరైన ఆదారాలతో నగదు తిరిగి పొందవచ్చని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ తెలిపారు.
సూర్యాపేట, మార్చి 22 : ఎన్నికల నేపథ్యంలో సీజ్ అయిన నగదు విడుదల కోసం కలెక్టరేట్లో గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేశామని, సరైన ఆదారాలతో నగదు తిరిగి పొందవచ్చని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ తెలిపారు. కలెక్టరేట్లో గ్రీవెన్స్ కమిటీ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఒక వ్యక్తి రూ. 50 వేలలోపు నగదు మాత్రమే వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఉందన్నారు. ఆధారాలు లేకుండా ఎక్కువ మొత్తంలో నగదు తీసుకుపోవద్దని సూచించారు.
నిబంధనలు అతిక్రమించి ఎక్కువ మొత్తంలో నగదు దొరికితే వాటిని సీజ్ చేసి జిల్లా ట్రెజరీలో జమ చేస్తామన్నారు. పది లక్షల రూపాయలకు పైగా నగదు పట్టుబడితే ఆదాయాపు పన్ను శాఖకు అప్పగిస్తారని తెలిపారు. అకౌంట్ పాస్‌బుక్, ఏటీఎం చిట్టి, వస్తువులు, ధాన్యం విక్రయ నగదు సంబంధిత బిల్లులు, లావాదేవీల వివరాలు చూపించాల్సి ఉంటుందన్నారు. జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఇన్చార్జిగా జిల్లా పరిషత్ సీఈఓ అప్పారావును నియమించామని, ఆయన ఫోన్ నంబర్ 8374566222లో సంప్రదించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ అప్పారావు, డీఆర్డీఓ మధుసూదన్‌రాజు, జడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష, ఏఓ సుదర్శన్‌రెడ్డి , శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

