HomeNalgondaCollector Narayana Reddy Said That Special Officers Should Focus On Gram Panchayats And Municipalities For The Next Three Months
ప్రత్యేక అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ప్రత్యేక అధికారులు రానున్న మూడు నెలలపాటు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన జిల్లా అధికారుల సమ్మిళిత సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
నల్లగొండ కలెక్టర్ నారాయణరెడ్డి
నల్లగొండ, సెప్టెంబర్ 9 : ప్రత్యేక అధికారులు రానున్న మూడు నెలలపాటు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన జిల్లా అధికారుల సమ్మిళిత సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పంచాయతీల్లో చిన్న చిన్న పనులు చేపట్టేందుకు అడ్వాన్స్‌లు తీసుకునే సౌకర్యం కల్పించాలని ప్రత్యేక అధికారులకు సూచించారు.
ప్రతి మంగళవారం ఒక గ్రామాన్ని సందర్శించి, తాగునీటి సమస్యలు, సీజనల్ వ్యాధులు, ఇతర సమస్యలపై ఆరా తీసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజావాణిలో ఫిర్యాదులను పరిష్కరించాలని, ప్రభుత్వ స్థలాలను గుర్తించి సిద్ధంగా ఉంచాలని అన్నారు. మున్సిపాలిటీల్లోనూ కమిషనర్లు స్థానికంగా నెలకొన్న సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గాల్లో పాఠశాలలు, ఆస్పత్రుల కోసం నియమించిన అధికారులు ఆయా అంశాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు పూర్ణచంద్ర, శ్రీనివాస్, డీఎఫ్ఓ రాజశేఖర్, స్ఫెషల్ కలెక్టర్ నటరాజ్, డీఆర్ఓ రాజ్యలక్ష్మి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.