కట్టంగూర్, నవంబర్ 19 : ట్రామా కేర్ సెంటర్ ప్రారంభోత్సవ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కట్టంగూర్ మండలంలోని పామనుగుండ్ల గ్రామంలో జాతీయ రహదారిపై ప్రమాదాలకు గురైన క్షతగాత్రులకు వైద్యసేవలు అందించేందుకు ఏర్పాటు చేయనున్న ట్రామా కేర్ సెంటర్ ప్రారంభోత్సవ పనులను మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని జాతీయ రహదారి సమీపంలో 93 సర్వే నంబర్లోని ఎకరం భూమి ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు అనువైనదిగా గుర్తించినట్లు తెలిపారు. జాతీయ రహదారి, కేర్ సెంటర్ స్థలం మధ్య ఉన్న వరద కాల్వలో కల్వర్టు నిర్మించాలని అధికారులకు సూచించారు.
త్వరలో కేర్ సెంటర్ పనులకు శంకుస్థాపన చేయనున్నుట్లు ఆమె చెప్పారు. ఆమె వెంట తాసీల్దార్ గుగులోతు ప్రసాద్, ఆర్ఐ సిరిగిరి కుమార్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి జయసుధ, జీపీ సిబ్బంది బండారు మధు, బండారు ఆనంద్ ఉన్నారు.