కట్టంగూర్, ఫిబ్రవరి 10 : రైతులు సంఘటితంగా ఏర్పడి పంటల సాగులో సాంకేతికతను ఉపయోగించుకుని అధిక దిగుబడులు సాధించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన అన్నారు. మండలంలోని అయిటిపాముల గ్రామ పరిధి గంగాదేవిగూడెం సమీపంలో ఉన్న కట్టంగూర్ రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని శనివారం ఆమె అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్‌పాటిల్‌తో కలిసి సందర్శించారు. సంఘం నిర్వాహకులు నిమ్మ స్టోరేజీ యూనిట్, ప్రాసెసింగ్ యూనిట్, సోలార్ డయ్యర్ల గురించి కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కూరగాయలు, పండ్ల వ్యర్థాలతో ఎరువు తయారీపై దృష్టి పెట్టాలనాన్నారు.
సన్న, చిన్న కారు రైతులు సమస్యలను పరిష్కరించుకునేదుకు సంఘటితంగా ఎఫ్‌పీఓను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమల అధికారి సంగీత లక్ష్మి, డీఆర్డీఏ పీడీ కాళిందిని, నాబార్డు జిల్లా మేనేజర్ వినయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, నియోజకవర్గ ఉద్యాన అధికారి రావుల విద్యాసాగర్, ఎంపీడీఓ పోరెళ్ల సునీత, తాసీల్దార్ డొంకెన స్వప్న, ఎంపీఓ మహ్మద్ అథర్ పర్వేజ్, వ్యవసాయ అధికారులు, శ్రీనివాస్, గిరిప్రసాద్, జామియా, ఆర్ఐ సిరిగిరెడ్డి కుమార్‌రెడ్డి, ఏపీఓ కడెం రాంమోహన్, ఏపీఎం చౌగోని వినోద, ఎఫ్‌పీఓ చైర్మన్ సైదమ్మ, ఐఆర్డీఎస్ చైర్మన్ రమేశ్ పాల్గొన్నారు.