రామగిరి : ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్పుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడంలో జిల్లా విద్యాశాఖ నిర్లక్ష్యంపై నల్గొండ కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ( Collector Anger ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్తవానికి లక్ష్యాన్ని జనవరి 30తో పూర్తి చేయాల్సి ఉండగా జిల్లాలో
22 మంది మండల విద్యాధికారులు ( MEOs ) పూర్తి చేయకపోవడంపై స్పందించిన కలెక్టర్ వారికి షోకాజ్ నోటీసులు (Notices) జారీ చేశారు.
జిల్లావ్యాప్తంగా షోకాజ్ నోటీసులు అందుకున్న ఎంఈవోలు 3,122 మంది విద్యార్థుల దరఖాస్తులను జనవరి 30లోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉండగా 2,320 మాత్రమే పూర్తి చేశారు. దీంతో, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ఉద్దేశించిన సంక్షేమ పథకాల గడువులను పాటించడంలో విఫలమైనందుకు జిల్లా కలెక్టర్ ఈనెల 6న షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ బయటికి పోకుండా ఇచ్చినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. త్వరగా రెండు రోజుల్లో సంతృప్తికరమైన వివరణలు సమర్పించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత నెలలో జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ జనవరి 30వ తేదీ గడువుగా నిర్ణయించారు. అయితే క్షేత్రస్థాయిలో దానిని పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తుంది.
22 మండలాలో పరిస్థితి ఇలా
చింతపల్లి మండలంలో 55.5 శాతం, చందంపేట 56.2 శాతం, తిప్పర్తి 58.5 శాతం, పెద్దవూర 61.3 శాతం, పీఏ పల్లి 61.5 శాతం, నార్కట్పల్లి 65.7 శాతం, దేవరకొండ 65.7 శాతం, చిట్యాల 70.8 శాతం మాత్రమే పూర్తి చేశారు. గుండ్లపల్లి 71.2 శాతం, మర్రిగూడ 72.2 శాతం, గట్టుపల్ 73.5, నిడ్మనూర్ 75, అనుముల 75, చండూర్ 77, కొండమల్లేపల్లి 77.6, నాంపల్లి 79.7, కట్టంగూర్ 82.8, నకిరేకల్ 82.9, గుర్రంపోడు 85, వేములపల్లి 86.6, నల్లగొండ 87.6 శాతం, మిర్యాలగూడ 88.2 శాతంగా మాత్రమే పూర్తి చేయడంతో వారికి నోటీసులు అందజేశారు.