నిడమనూరు, నవంబర్ 18 : సీఎంఆర్ఎఫ్ సాయం పేదలకు వరం అని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలో 35 మంది లబ్దిదారులకు మంజూరైన రూ. 14,01,500 విలువైన చెక్కులను మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా అందిస్తున్న సాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిరుపేదల ఇబ్బందులు గుర్తించిన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ సాయం తక్షణ మంజూరుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ జానీపాషా, శిరీషాల యాదగిరి, మేరెడ్డి వెంకట రమణ, చరక శ్రీను, కోట్ల సైదులు, మెరుగు శ్రీను పాల్గొన్నారు.