– తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో కదం తొక్కిన గులాబీ సైనికులు
తుంగతుర్తి, సెప్టెంబర్ 02 : కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల వైఫల్య పాలనపై తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన 420 మోసపూరిత హామీలతో రూపొందించిన 420 మీటర్ల ఫ్లెక్సీతో వినూత్న రీతిలో ర్యాలీ నిర్వహించి, కాంగ్రెస్ బాకీ కార్డ్ లను పంపిణీ చేశారు. తుంగతుర్తిలోని పార్టీ కార్యాలయo నుండి మొదలైన ర్యాలీ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా తెలంగాణ తల్లి ప్రధాన కూడలి వరకు 4 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గాదరి కిశోర్ కుమార్ మాట్లాడుతూ… తాను పదేళ్ల ఎమ్మెల్యే కాలంలో రూ.10 లక్షల ఇసుక మాఫియా చేసినట్లు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. రాష్ట్రంలో పైన ఒక GM మేస్త్రి కింద ఒక BM మేస్త్రి పాలన చేస్తున్నారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. రేవంత్ రెడ్డి చరిత్రలో చెత్త సీఎంగా మిగిలిపోతాడు. కేసీఆర్ కాలి గోటికీ కూడా సరిపోని రేవంత్ రెడ్డి అడ్డగోలిగా మాట్లాడుతున్నాడు. ఖబడ్దార్ రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి మాట్లాడితే నాలుక చిరేస్తాం. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో గద్దె నెక్కి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని దుయ్యబట్టారు.

ఆంధ్రోళ్లకు చద్ది కడుతున్న నీచపు సీఎం రేవంత్ రెడ్డి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
నీళ్ల దొంగ చంద్రబాబు, రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందంలో భాగంగానే సాగర్ నీళ్లు దోచుకొని పోతున్నారు. ఆంధ్రాకు తరలిస్తున్నారు. మన రైతులను ఎండబెట్టి ఆంధ్రోళ్లకు చద్ది కడుతున్న నీచపు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ జపం లేకుండా ఏ సభలో కూడా వెయ్యి రోజుల పాలన చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయ్యప్ప, ఆంజనేయ స్వామి మాల మాదిరిగా కేసీఆర్ మాల రేవంత్ రెడ్డి వేసుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేస్తోంది. రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు, కుటుంబానికి ఏ పదవిలో ఉన్నారని వారికి సెక్యూరిటీ ఇస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవడం కోసం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆంధ్రోళ్లకు చద్ది కడుతున్న నీచపు సీఎం రేవంత్ రెడ్డి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, రాష్ట్ర నాయకులు నేవూరి ధర్మేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహ రెడ్డి, పార్టీ మండల పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఆయా గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్ల, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, బీఆర్ఎస్ విద్యార్థి, యువజన, పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.