చందంపేట (దేవరకొండ), సెప్టెంబర్ 17 : సీఎం సహాయ నిధిని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బుధవారం పట్టణంలోని మార్కెట్ యార్డులో 306 మంది లబ్ధిదారులకు రూ.1.14 కోట్లు విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం సహాయ నిది పేదలకు వరం లాంటిదన్నారు. ఆపదలో ఉన్నవారికి సీఎం సహయ నిధి ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జమున మాధవరెడ్డి, మాజీ ఎంపీపీలు గోవింద్ యాదవ్, వెంకటయ్య గౌడ్, సాదిక్, భద్యా నాయక్, రంగయ్య, గిరి, కొర్ర రామ్ సింగ్ నాయక్, హరికృష్ణ, సురేష్ గౌడ్ పాల్గొన్నారు.