త్రిపురారం, జులై 09 : ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి వరం లాంటిదని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో వివిధ గ్రామాలకు చెందిన 37 మంది లబ్ధిదారులకు రూ.9.16 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కాగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్న పేదలు అప్పుల పాలు కాకూడదన్న ఉద్దేశ్యంతో సీఎం సహాయ నిది ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.
పేదలు సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి చారి, సీనియర్ నాయకులు కలకొండ వెంకటేశ్వర్లు, అనుముల శ్యాంసుందర్‌రెడ్డి, అనుముల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బైరం కృష్ణ, రవి, బండారు ప్రసాద్, జలీల్, కోటిరెడ్డి పాల్గొన్నారు.