తిరుమలగిరి, జనవరి 1 : సీఎం కేసీఆర్ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించి దేశానికే ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ కొనియాడారు. మండలంలోని వెలిశాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మొగిలి సాయికిరణ్, షారుక్‌ఖాన్, బొడ్డు సంతోష్, శ్రీహరి, రుతీశ్తో పాటు 50మంది ఆదివారం ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. అందుకే వివిధ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ప్రజల సంక్షేమం కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు రఘునందన్‌రెడ్డి, జిల్లా నాయకులు దూపటి రవీందర్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాకూబ్‌నాయక్, రైతుబంధు కోఆర్డినేటర్ నరోత్తంరెడ్డి, దండిగ నాగరాజు, కరుణాకర్, బత్తిని సూరి పాల్గొన్నారు.