సూర్యాపేట, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంతోషాల హరివిల్లులా ఓలలాడుతోంది. ఎప్పటి మాదిరి ఈ సారి యాసంగి సాగు సీజన్లో సైతం రైతులకు పెట్టుబడి సాయం అందుతోంది. సీఎం కేసీఆర్ ప్రకటించి నిధులు మంజూరు చేసిన వెంటనే దశలవారీగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమవుతుండగా రైతుల సెల్ఫోన్లలో టింగ్టింగ్మంటూ మెసేజ్‌లు వస్తుంటే రైతుల మోముల్లో నవ్వులు విరజిల్లుతున్నాయి.
గత ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయాన్ని కనీసం పట్టించుకున్న నాధుడే లేకపోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు పారిస్తుండగా విద్యుత్ పుష్కలంగా వస్తున్నది. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుతున్నాయి. వీటికి తోడు సాగుబాట పట్టేకంటే ముందే రైతుబందు పేరిట పెట్టుబడి సాయం అందిస్తుండడం పట్ల రైతుల ఆనందాలకు అవధులే లేవు. తాజాగా యాసంగి సీజన్‌కు సంబంధించి మొత్తం పది రోజుల్లో రైతులందరికీ పెట్టుబడి సాయం అందనుండగా ప్రస్తుతం రెండు రోజులు పూర్తై నేపథ్యంలో నాలుగో రోజైన శనివారం ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా మూడు ఎకరాల లోపు ఉన్న రైతులు 5,40,282మంది రైతుల అకౌంట్లలో రూ.370,24,49,083కోట్లు జమయ్యాయి.
సూర్యాపేట జిల్లాలో 1,98,665మంది రైతులకు రూ.133,76, 72,546అకౌంట్లలో జమకాగా నల్లగొండ జిల్లాలోని 3,41,617మంది రైతులకు రూ.236,47, 76,537 జమ కావడంతో రైతులు హర్షాతి రేకాలు వ్యక్తం చేస్తున్నారు.