రామగిరి/సూర్యాపేట అర్బన్, ఏప్రిల్ 2 : పదో తరగతి వార్షిక పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 21న ప్రారంభమైన పరీక్షలు సాంఘిక శాస్త్రం పరీక్షతో పూర్తయ్యాయి. ఏడాది అంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు సంతోషంగా గంతులేశారు. పరీక్ష కేంద్రాల వద్ద తోటి విద్యార్థులకు వీడ్కోలు చెప్పుకున్నారు.
ఫొటోలు, సెల్ఫీలు దిగారు. సంక్షేమ హాస్టళ్లలో ఉండే విద్యార్థులు ఇంటి బాట పట్టారు. తల్లిదండ్రులు, విద్యార్థులతో బస్టాండ్లు కిటికిటలాడాయి.