నల్లగొండ, జులై 07 : పౌర సరఫరాల శాఖకు చెందిన డిప్యూటీ తాసీల్దార్ జావేద్ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సివిల్ సప్లై శాఖలో డీటీగా విధులు నిర్వహిస్తున్న జావేద్ బియ్యం అక్రమ రవాణాలో పట్టుబడిన మూడు వాహనాలను విడిపించేందుకు గాను రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు అన్ని డబ్బులు ఇవ్వలేను అని చెప్పడంతో, రూ.70 వేలు అయినా ఇవ్వాలన్నాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్ర ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేసి జావేద్ డబ్బులు అడిగినట్లు నిర్ధారించారు. సోమవారం అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో రిమాండ్ చేశారు.