Handloom Artists | చండూరు, మార్చి 06 : ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో బుధవారం సాయంత్రం చేనేత కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శనలతో కూడిన వివిధత్ కా అమృత మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 20 మంది చేనేత హస్త కళాకారులు ఈ ప్రదర్శనకు ఎంపిక కాగా.. నల్గొండ జిల్లా చండూరుకు చెందిన జాతీయ అవార్డు గ్రహీత గంజి యాదగిరి, జాతీయ మెరిట్ అవార్డు గ్రహీత చిలుకూరు శ్రీనివాసులు ఉండడం విశేషం.
తమ నైపుణ్యంతో తయారు చేసినటువంటి చేనేత ఉత్పత్తుల గురించి ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు స్వయంగా వివరించారు.
చాలా సంతోషంగా ఉంది : గంజి యాదగిరి, జాతీయ అవార్డు గ్రహీత, చండూరు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్పత్తులను చూసి మెచ్చుకున్నారు. చాలా ఆసక్తికరంగా ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయిలో చేనేత హస్త కళలకు ప్రత్యేక స్థానం తీసుకొస్తం.
ప్రోత్సహిస్తే మరింత రానిస్తాం : చిలుకూరి శ్రీనివాసులు జాతీయ మెరిట్ అవార్డు గ్రహీత, చండూరు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కళాకారులను ప్రోత్సహిస్తే వృత్తి నైపుణ్యాన్ని మరింతగా పెంపొందించుకొని ఇంకా బాగా రానిస్తాము. చేనేత రంగానికి సంబంధించి ఉన్న సమస్యలను ప్రభుత్వం గుర్తించి వాటిని పరిష్కరించాలి. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉంది. రాష్ట్రపతికి, గవర్నర్కు, ఉప ముఖ్యమంత్రికి మా చేనేత ఉత్పత్తులను వివరించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది.
ఈ సందర్భంగా చేనేత కళాకారుల ఉత్పత్తులను చూసి ప్రముఖులంతా ఎంతగానో అభినందించారు. గంజి యాదగిరి, చిలుకూరు శ్రీనివాసులు జాతీయస్థాయిలో ప్రతిభ చాటడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులపాటు ఈ ప్రదర్శన జరగనుంది.
S Jaishankar | అధిక సుంకాలతో భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలపై అనిశ్చితి.. జై శంకర్ ఏమన్నారంటే..?
Bandlaguda Jagir | చెత్త బండ్లగూడ.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై పట్టింపేది?
Janhvi Kapoor| రామ్ చరణ్ కొత్త సినిమా నుండి జాన్వీ లుక్ రిలీజ్.. ఒక్కసారిగా పెరిగిన అంచనాలు