చిట్యాల, జూలై 17: సర్లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలు ముట్టినట్లు ఓటర్లకు బీఎల్వోలు రసీదులు ఇవ్వాలని, ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఓటర్లకు అవగాహన కల్పించాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ‘బీఎల్వోలు రెండు ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేసిన తర్వాత ఒక ఫారం తీసుకుంటున్నారు. వారికి ఆ ఫారం ముట్టినట్లు ఎలాంటి రసీదు ఇవ్వడం లేదు’ అని ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సర్పై ప్రచారం చేస్తున్న అధికారులు రసీదులపై ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఓటర్ల పేర్లు గల్లంతైతే ఎవరిని ప్రశ్నించాలని, ప్రశ్నించడానికి వారి వద్ద ఏ ఆధారాలు ఉంటాయని ప్రశ్నించారు. ఎన్యుమరేషన్ ఫారాలకు రసీదులు అందజేయాలన్నారు.