నకిరేకల్, మార్చి 4: ఎమ్మెల్యే వేముల వీరేశం పోలీసుల సాయం లేకుండా, వ్యాపారవేత్తల దగ్గర నుంచి డబ్బు గుంజకుండా, ఆయన చేసిన అభివృద్ధినే రెఫరెండంగా పెట్టి, మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాకుండా అడ్డుకొని, అప్పుడు నకిరేకల్ సెంటర్లో తొడగొట్టాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సవాల్ విసిరారు. హోలీ వేడుకల సందర్భంగా మంగళవారం పట్టణంలో బీఆర్ఎస్పై, తనపై ఎమ్మెల్యే వీరేశం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నకిరేకల్‌లో బుధవారం చిరుమర్తి లింగయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేండ్లలో చేసిన అభివృద్ధిపై చిట్యాల ఎన్నికల్లో సవాల్ విసిరితే పారిపోయినోడు వీరేశం అని, ఆయన బీఆర్ఎస్పై, తనపై చిల్లర మాటలు మాట్లాడతడా? అని ప్రశ్నించారు. 25 నెలల అయింది హామీ ఇచ్చి ఇంతవరకు నకిరేకల్ పట్టణ ప్రజలకు వెయ్యి ఇందిరమ్మ ఇళ్లు ఎప్పుడిస్తావ్.. అని ప్రశ్నించారు.
చిట్యాల మున్సిపల్ ఎన్నికలలో 11 వార్డుల్లో పోటీచేశామని, అయినప్పటికీ తక్కు మార్జిన్(11ఓట్లు)తో ఒక వార్డు, 39 ఓట్లతో ఒక వార్డు, 45 ఓట్లతో ఒక వార్డు, 49 ఓట్లతో ఒక వార్డు, 80 ఓట్ల తేడాతో ఒక వార్డు ఓడిపోయాయమన్నారు. అధికార పార్టీ సీపీఎంతో పొత్తుపెట్టుకుని పోలీసు యంత్రాం గం బెదిరింపులు, అరాచకాలు సృష్టించి, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రచారం చేసుకోకుండా అడ్డుకున్నారన్నారు. ఓడిపోతామనే భయంతో వ్యాపారవేత్తలు స్వేచ్ఛగా ఓటు వేసే, పరిస్థితి లేకుండా చేశారన్నారు. తమకు ఓటు వేయకుంటే కాల్వల్లో పైపులు వేయనియ్యబోమని, కరెంటు కట్ చేయిస్తామని రైతులను బెదిరించారన్నారు. చిట్యాలలో 4, 5, 6, 7, 8, 12 వార్డుల్లో ఓ వ్యాపారవేత్త ఓటు వేయకున్నా, ఆ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోతే వ్యాపారవేత్తలే బాధ్యత తీసుకోవాలని బెదరించారన్నారు. బీఆర్ఎస్ నాయకులను పోలింగ్ బూత్‌ల వద్ద ఉండనివ్వకుండా ఏ రకంగా కాంగ్రెస్ గెలిచిందో ప్రజలకు తెలుసునన్నారు.
బెదించి ఓట్లు వేసుకున్నా, నైతిక విజయం బీఆర్ఎస్ దేనన్నారు. చిట్యాలలో తమదే గెలుపు అని చెప్పుకోవడానికి ఎమ్మెల్యేకు సిగ్గనిపించడంలేదా అన్ని ప్రశ్నించారు. అభివృద్ధిపై సవాల్ విసిరితే పారిపోయిన చిల్లర నాయకుడు ఎమ్మెల్యే వీరేశం అన్నారు. చిట్యాలలో గుండు సున్న వచ్చింది, నకిరేకల్‌లో గుండు సున్నా రావాలి అని వెకిలి మాట్లాడడం ఎమ్మెల్యే స్థాయికి తగదన్నారు. నకిరేకల్‌లో 100 పడకల దవాఖానను బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో కష్టపడి తీసుకొచ్చానని గుర్తుచేశారు. తానే 100 పడకల ఆస్పత్రి తెచ్చానని వీరేశం చెప్పడం సిగ్గుచేటన్నారు. దయచేసి ఎమ్మెల్యే నిజాలు మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. సోషల్ మీడియా, ఫేక్ మీడియాతో విష ప్రచారం చేయడం తప్ప ఎమ్మెల్యే చేసిందేమీ లేదన్నారు. సమావేశం లో మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, బీఆర్ఎస్ నకిరేకల్, కేతేపల్లి మండలాల అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, కడపర్తి గ్రామ సర్పంచ్ గొర్ల వీరయ్య, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేశ్, రాచకొండ వెంకన్న, గ్రంథాలయ మాజీ చైర్మన్ కొండ విన య్, బీఆర్ఎస్ నాయకులు అ మీర్పాషా, ఎం డీ జాఫర్, పల్స నరేశ్, చిట్యాల అశోక్, తదితరులు పాల్గొన్నారు.