నార్కట్‌పల్లి, జనవరి 30 : సీఎం రేవంత్‌రెడ్డికి పాలన చేతగాకే బీఆర్ఎస్పై బురద జల్లుతూ డైవర్షన్ రాజకీయాలు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. శనివారం పట్టణ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనుమతితో రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేస్తారని, శాంతిభద్రతల విషయంలో అధికారులు చేసేది ఫోన్ ట్యాపింగ్ అనే విషయాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. తమ ఫోన్లను ట్యాప్ చే స్తున్నారని స్వయంగా కాంగ్రెస్ మం త్రులే ఆరోపిస్తున్నారని, దీనిపై ప్ర భుత్వం సమాధానం చెప్పాలని అన్నా రు. కేసీఆర్ 10 ఏండ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై పోటీ పడలేక రేవంత్‌రెడ్డి ప్రభత్వం నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని మరల్చడానికి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేశారన్నారు. సింగరేణి బొగ్గు బ్లాకుల వ్యవహారంలో అవినీతిని బట్టబయలు చేస్తున్న క్రమం లో బీఆర్ఎస్ అగ్ర నేతలనే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేద్దామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చాడ కిరన్‌కుమార్‌రెడ్డి, యానాల అశోక్‌రెడ్డి, దూదిమెట్ల సత్తయ్య యాదవ్, బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, జడల ఆదిమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనని, మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తామని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య క్యాంపు కార్యాలయంలో చిట్యాల మున్సిపల్ పదో వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు నిమ్మనగోటి శ్రీను, యువశక్తి యూత్‌కు చెందిన 100 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి చిరుమర్తి లింగయ్య గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో చిట్యాలలో రూ.40 కోట్లతో అనేక పనులు చేపట్టామన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చాడా కిషోర్ కుమార్‌రెడ్డి, యానాల అశోక్‌రెడ్డి, బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, జడల ఆదిమల్లయ్య తదితరులు ఉన్నారు.