దేవరకొండ రూరల్, జూన్ 20 : దేవరకొండ మండలంలోని చింతబాయి గ్రామ మాజీ సర్పంచ్ మల్లేశ్ పలువురికి ఆదర్శంగా నిలిచారు. తన కుమారుడిని గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతిలో చేర్పించారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీంతో పలువురికి ధైర్యంగా ఉండేలా దేవరకొండలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న తన కుమారుడిని గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్చించారు. మల్లేశ్‌ను ఆదర్శంగా తీసుకున్న పలువురు తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు బంద్ చేయించి దాదాపు 10 మందిని అదే పాఠశాలలో చేర్పించారు. పిల్లల చేరిక, తల్లిదండ్రుల విశ్వాసంపై పాఠశాల హెచ్ఎం రమేశ్ సంతోషం వ్యక్తం చేశారు.