– టీఎస్ యూటీఎఫ్, పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘాల హర్షం
రామగిరి, డిసెంబర్ 31 : నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తిలో జరిగిన ఎన్నికల విషయంలో సస్సెండ్ అయిన ఎన్నికల సిబ్బంది (ఉపాధ్యాయులు, ఇతర అధికారులైన పీఓలు)పై సస్పెన్షన్ ఎత్తివేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డీపీఓ వెంకయ్య సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేశారు. దీంతో సదరు ఉపాధ్యాయులు, అధికారులు బుధవారం సాయంత్రం డీపీఓ నుండి రద్దు ఉత్తర్వులు అందుకున్నారు. ఈ చర్యపై టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి పెరుమళ్ల వెంకటేశం కలెక్టర్, డీపీఓకు ధన్యవాదాలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. సస్పెషన్ ఎత్తివేడయడంలో ప్రయత్నం చేసిన టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీతో పాటు ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సస్పెషన్ రద్దుపై పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కాళం నారాయణరెడ్డి, జిల్లా ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (టీఎస్పీటీఏ) జిల్లా అధ్యక్షుడు మహామ్మద్ అబ్దుల్ గపూర్, అదనపు కార్యదర్శి అక్కెనపల్లి రాములులు హర్షం వ్యక్తం చేశారు.