పెన్పహాడ్, అక్టోబర్ 21 : ప్రభుత్వం చిన్న పిల్లలకు అందించే ఉచిత టీకాలను ప్రతి బుధవారం, శనివారం క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారం అందించాలని సూర్యాపేట జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ సిబ్బందికి సూచించారు. మంగళవారం పెన్పహాడ్ మండలంలోని సింగరెడ్డిపాలెం, అనంతారం గ్రామాల ఆయుష్మాన్ ఆరోగ్య ఉప కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో పలు రికార్డులను పరిశీలించి గ్రామంలో గర్భిణీలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. జన ఆరోగ్య సమితి (జాస్) రిజిస్టర్లను, తీర్మాణాలను, బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులకు సంబంధించి MLHP, ANM అలాగే మెడికల్ ఆఫీసర్ ల వివరణలను నమోదు చేసుకున్నారు. రికార్డుల నిర్వహణపై సలహాలు, సూచనలు ఇచ్చి పాటించవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డా.రాజేశ్, NHM DPO ఉమామహేశ్వరి, MLHP డా.వాసవి, ఏఎన్ఎంలు జయశ్రీ, దుర్గమ్మ, ఆశలు పాల్గొన్నారు.
Penpahad : చిన్నారులకు షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయాలి : డీఎంహెచ్ఓ చంద్రశేఖర్