చందంపేట, మే 15 : నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సాసర్ పిట్స్ వద్దకు వివిధ అటవీ జంతువులు దాహం తీర్చుకునేందుకు వచ్చి ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. అందులో ఒక చిరుత కూడా ఉన్నది.
చందంపేట మండలం కంబాలపల్లి రేంజ్ పరిధి మబ్బుచేనులోని సోమరిపాయ అటవీ ప్రాంతంలో సుమారు 78 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఎఫ్డీఓ సర్వేశ్వర్ తెలిపారు. చిరుత దృశ్యాలతో పాటు మరికొన్ని జంతువుల ఫొటోలు ట్రాప్ కెమెరాలో చిక్కినట్లు ఆయన చెప్పారు. అటవీ జంతువుల సంరక్షణకు ఎఫ్ఆర్ఓలు భాస్కర్, సాయి ప్రకాశ్ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.