చండూరు, ఫిబ్రవరి 02 : బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట 4, 5వ వార్డులకు చెందిన కాంగ్రెస్ నాయకులు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సూర్యాపేట జడ్పీ వైస్ చైర్మన్, మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్త గోపగాని వెంకట్ నారాయణ గౌడ్ సమక్షంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇడికూడా శ్రీను, కొంపెల్లి యాదయ్య గౌడ్, గంజి వెంకటేశం, తదితరులు బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చక, అబద్ధపు మాటలతో విసిగిపోయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, మున్సిపాలిటీ అధ్యక్షుడు కొత్తపాటి సతీష్, బోయపల్లి అనంత్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ఎత్తపు మధుసూదన్ రావు, పట్టణ మహిళా అధ్యక్షురాలు సంఘపు సువర్ణ, మండల మహిళా అధ్యక్షురాలు పెండ్యాల గీత, ఐదో వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి కొమిరెడ్డి మధు, నకరికంటి రామలింగం గౌడ్, నకరికంటి వెంకట్ గౌడ్, రెండో వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి అనపర్తి శేఖర్, నాలుగో వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి ఇరిగి వెంకటమ్మ రామన్న, నేలపట్ల యాదగిరి గౌడ్, అంబల శంకర్ గౌడ్, పులిజాల యాదయ్య, వెంకన్న పాల్గొన్నారు.