దేవరకొండ : నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం రత్య తండాకు చెందిన రమావత్ చందర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ పొందారు. ఆదివారం డాక్టరేట్ సాధించిన చందర్‌ను బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ శాసనసభ్యుడు రమావత్ రవీంద్ర కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా చందర్ ను శాలువతో సత్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..గిరిజన తండాకు చెందిన చందర్ డాక్టరేట్ పొందడం అభినంద నీయమని అన్నారు. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరుపేద కుటుంబంలో జన్మించిన చందర్ డాక్టరేట్ సాధించారని ఆయన అన్నారు. చందర్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రత్య తండలో మొదటి డాక్టరేట్ పొందిన చందర్ అని ఆయన తెలిపారు.